అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలి

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

కాళోజీ సెంటర్‌: ఈ విద్యాసంవత్సరంలో లక్ష్యం మేరకు ఇంటర్‌ అడ్మిషన్లు పెంచడానికి కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మంగళవారం రాయపర్తి, వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను సందర్శించారు. కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, సిలబస్‌, పాఠ్య పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్షించారు. ఇంటర్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు గత సంవత్సరం కన్నా మెరుగైన అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినందున ఇంటర్మీడియట్‌లో జాయిన్‌ కానీ విద్యార్థుల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటికే 1,040 మంది విద్యార్థులు చేరారని, మరో రెండు వారాల్లో 300 పైగా అడ్మిషన్లు పూర్తి చేసుకొని లక్ష్యం చేరుకోవాలన్నారు. ప్రిన్సిపాల్స్‌ జయకుమారి, సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement