గోదావరి జలాలు వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

గోదావరి జలాలు వచ్చేనా?

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

ఖానాపురం: అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. వరి పంటల సాగుపై మల్లగుల్లాలు పడుతున్నారు. సముద్రం లాంటి పాకాల తలాపున ఉన్నప్పటికీ ఆయకట్టు రైతుల్లో దిగాలు నెలకొంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ ద్వారా నీరు వస్తే పంటల సాగుకు సమాయత్తం అవుదామనుకుంటే అధికారులు, పాలకుల నుంచి స్పష్టత లేదు. దీంతో పాకాల ప్రాజెక్ట్‌ నీటి కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది పాకాల ఆయకట్టు. పాకాల ఆయకట్టు కింద వర్షాకాలంలో 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతుంటాయి. వర్షాధారంతో చెరువు నిండుకుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులో 14 ఫీట్ల నీటిమట్టం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు అనుకున్న మేర వర్షాలు కురవలేదు. ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటికే వేల రూపాయలతో విత్తన బస్తాలను తీసుకువచ్చి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కానీ వర్షాలు పడకపోవడంతో నారుమడులను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో పాటు సమీప వ్యవసాయ బావుల రైతుల సహకారంతో నార్లను కాపాడుకుంటున్నారు. నార్లను కాపాడుకున్నా.. పంటలు సాగు అవుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రాజెక్ట్‌పై ఆశలు..

పాకాలకు రామప్ప నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చే ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయల నిధుల మంజూరి చేయించారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయించి రెండో పంటకు సైతం పుష్కలంగా నీరందించారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో ఆయకట్టు రైతులు అదే ప్రాజెక్ట్‌పై కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్‌ ద్వారా నీటిని విడుదల చేస్తే పాకాల చెరువు నిండుకోని రైతులు వరి పంటలను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాసంగిలో పంటల సాగు కోసం నీటి విడుదల జరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నీరు ఎందుకు చెరువులోకి తీసుకురావడంలేదనే ప్రశ్నలు రైతులు లేవనెత్తుతున్నారు. శ్రీరెండు రోజుల్లో గోదావరి జలాలతో పాకాల చెరువును నింపి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాశ్రీమని ఇరిగేషన్‌ ఈఈ తెలిపారు.

పాకాల ప్రస్తుత నీటిమట్టం 14 ఫీట్లు

ప్రాజెక్ట్‌ నీటి కోసం ఎదురుచూపు

ఎండుతున్న నారుమడులు

అవస్థలు పడుతున్న అన్నదాతలు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement