ఖానాపురం: మహిళలు వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని దబ్బీర్‌పేట, చిలుకమ్మతండ, అశోక్‌నగర్, బుధరావుపేట, రాగంపేట, కొత్తూరు, రంగాపురం గ్రామాల్లో రూ.కోటి నిధులతో మహిళా సంఘం భవనాలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, అసంపూర్తి జీపీ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పాలాయి శ్రీనివాస్, రావుల హరీష్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ యడ్ల భిక్షంరెడ్డి, సర్పంచ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలగందుల రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాకాల ఆయకట్టుకు నీటి విడుదలపై రెండు రోజుల్లో సమీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి


