వేలేరు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

వేలేరు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

వేలేరు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

వేలేరు: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసుల పురోగతి, శాంతి భద్రతల నిర్వహణపై వారు సమీక్ష నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని, రోడ్డు ప్రమాదాల వివరాలు తక్షణమే ఐఆర్‌ఏడీ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, రౌడీషీటర్ల కదలికపై నిఘా ఉంచాలని, వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఎస్సై చొరవ చూపాలని, రాత్రి పూట పెట్రోలింగ్‌ చేయాలని, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement