
ఏఏఎం వైద్యసేవలపై అసెస్‌మెంట్
● వర్చువల్‌గా పరిశీలించిన కేంద్రబృందం
కమలాపూర్ : మండలంలోని గుండేడులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం)ను జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ కోసం కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ రూపాలి రామ్, డాక్టర్ జాకియా సయ్యద్‌లు గురువారం వర్చువల్‌గా పరిశీలించారు. ఏఏఎంలో అందజేస్తున్న వైద్యసేవలు, ఏఎన్‌సీ, ఐఈఎన్‌సీ, ఇమ్యూనైజేషన్, నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య క్వాలిటీ అసెస్‌మెంట్‌ను తెలుసుకుని వర్చువల్ అసెస్‌మెంట్ చేస్తున్న సెంట్రల్ టీం సభ్యులతో మాట్లాడారు. జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ కోసం జరుగుతున్న వెరిఫికేషన్‌లో ఏఏఎం అందజేస్తున్న వైద్యసేవలపై కేంద్రం బృందం సభ్యులతో పాటు డీఎంహెచ్‌ఓ అప్పయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా క్వాలిటీ మేనేజర్లు సాగర్, అఖిల్, ఉప్పల్ పీహెచ్‌సీ వైద్యాధికారి పద్మశ్రీ, పల్లె దవాఖాన వైద్యాధికారి సంయుక్త, ఆర్బీఎస్‌కే వైద్యులు దుర్గాప్రసాద్, కవిత, డీపీఓ రుక్మోద్దీన్, రవీందర్, హెల్త్ సూపర్‌వైజర్ కనకలక్ష్మి, ఎస్‌టీఎస్ శ్రీనివాస్, ఎంటీలు, హెల్త్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.