
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థులు
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మండలంలోని ఇల్లంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎం.విజయ తెలిపారు. ఈనెల 25న హనుమకొండలోని షిర్డీ సాయిబాబా మందిరంలో జరిగిన సబ్ జూనియర్‌స్థాయి పోటీల్లో విద్యార్థులు రాధిక, వెన్నెల, నిహారిక, గీతాంజ లి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ పేర్, సప్నైన్ విభాగాల్లో మొదటి బహుమతి, ఐదు బంగారు పతకాలు గెలిచినట్లు పేర్కొన్నారు. అలాగే, సంకీర్తన, సాయిరామ్ రజత పతకాలు, చరణ్ కాంస్య పతకం గెలిచినట్లు వివరించారు. బంగారు పతకాలు సాధించిన నలుగురు విద్యార్థులు సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, మమత, సర్వన్, ఉమాదేవి, శోభారాణి, రాజు, కిశోర్, అంజయ్య, శ్రీధర్, జ్యోతి, స్వామి, పీడీ భవాని పాల్గొన్నారు.