
‘దూసపాటిలొద్ది’కి అనుమతి లేదు
వాజేడు: దూసపాటిలొద్ది జలపాతానికి పర్యాటకులకు అనుమతి లేదని ఎఫ్‌బీఓ లలిత తెలిపారు. మండల పరిధి కొంగాల గ్రామ సమీపంలోని గుట్టల వద్ద ఉన్న దూసపాటి లొద్ది జలపాత సందర్శనకు ఆదివారం పలువురు పర్యాటకులు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఎఫ్‌బీఓ లలిత పర్యాటకులను లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని తిరిగి పంపించారు. పర్యాటకులు ఎవరూ దూసపాటి లొద్ది జలపాతం చూసేందుకు ప్రస్తుతం రావొద్దని సందర్శనను అధికారికంగా ఉన్నతాధికారులు నిలిపివేసినట్లు ఎఫ్‌బీఓ లలిత వివరించారు.