
వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం
వరంగల్ చౌరస్తా: రెసిడెన్షియల్ ఆవరణలో వరదనీరు నిల్వ ఉండటం, అంతర్గత లైటింగ్ లేకపోవడం, మెనూ పాటించకపోవడంతో వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరంగల్ యాకుబ్‌పురలోని ప్రభుత్వ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లు, వంట సరుకులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఏమైన సమస్యలు ఉంటే నేరుగా పెట్టెలో వేయాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన డార్మెటరీ షెడ్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీటీడీఓ సౌజన్య, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం, డీసీఓ సురేందర్, ప్రిన్సిపాల్ హేమంత్, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయులు ఉన్నారు.