
వైఎస్సార్‌కు ఘన నివాళి
వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రామానంద్, నాయకులు
నర్సంపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల కోసం చివరి శ్వాస వరకు పరితపించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, పట్టణ మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్‌కుమార్, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్‌రెడ్డి, నర్సంపేట మండల అధ్యక్షుడు కత్తి కిరణ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, వంశీకృష్ణ, డక్క శ్రీను, చిప్ప నాగ, ధక్షని కీర్తన తదితరులు పాల్గొన్నారు.