
13న లోక్ అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
బీవీ నిర్మలా గీతాంబ
వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయవాసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయవాసే వాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బీవీ నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్ బిల్డింగ్‌లో మొదట వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవా దులు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ లోక్ అదాలత్‌లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా, మో టార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్‌ఫండ్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులు, ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టుల్లో లే ని కేసులను ప్రీ – లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈనెల 1 నుంచి వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రీ లోక్ అదాలత్ ప్రారంభించి నట్లు తెలిపారు. ఇందులో కక్షిదారుల కేసును ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందన్నారు. సమావేశంలో కో ఆపరేటివ్ సొసైటీ ట్రిబ్యునల్ కోర్టు చైర్మన్, న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, వరంగల్ జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, తదితరులు పాల్గొన్నారు.