
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● సీపీ సన్‌ప్రీత్ సింగ్
వర్ధన్నపేట: ప్రజలు అందించే ఫిర్యాదుపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీసులు పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీ పోలీస్‌స్టేషన్ రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ విభాగాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశా రు. స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికా ర్డులను పరిశీలించి, సిబ్బందిని శాఖపరమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నమ్మకాన్ని కలి గించడంతో పాటు పోలీస్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు కో ణారెడ్డి చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై సాయిబాబు, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.