
బడా గణేశుడ్ని దర్శించుకునేందుకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ వైపు వచ్చే రహదారులన్నీ క్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపించింది.

వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో జనం ఖైరతాబాద్ గణేశుడ్ని దర్శించుకున్నారు. ఈ కారణంగా మెట్రో రైళ్లు,సిటీబస్సులు కిటకిటలాడాయి.

దర్శనం కల్పించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.













