
సమస్యల పరిష్కారానికి జంగ్ సైరన్..
ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి కావొస్తున్నా.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదని, ఉద్యోగుల సమస్యల సాధనకు జంగ్ సైరన్ మోగిస్తామని ఉద్యోగ సంఘాల జేఎసీ నాయకులు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని టీఎన్జీఓస్ భవన్‌లో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆకుల రాజేందర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడు తూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నేతలుగా తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యాచరణ ప్రకారం.. హనుమకొండ జిల్లా నుంచి సెప్టెంబర్ 8న బస్సు యాత్ర మొదలవుతుందని, అందులో రాష్ట్ర జేఏసీ మొత్తం హనుమకొండకు చేరుకుంటుందన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం ద్వారా మన నిరసనను పెద్ద ఎత్తున తెలియజేయాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా పెన్షన్ విద్రోహ దినం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం నేత అన్నమనేని జగన్ మోహన్ రావు, జేఏసీ నేతలు తిరుపతిరెడ్డి, ప్రవీ ణ్‌కుమార్, ఆకవరపు శ్రీనివాస్‌కుమార్, పెండెం రాజు, కట్కూరి శ్రీనివాస్, రాజ్‌కుమార్, రియాజొద్దీన్, సీతారాం, సర్వర్ హుస్సేన్, కుందూరు గోపాల్‌రెడ్డి, బైరి సోమయ్య, రవి ప్రకాశ్, విజయ్ మోహన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.