నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

Aug 29 2025 7:10 AM | Updated on Aug 29 2025 7:10 AM

నిమజ్

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ వచ్చే నెల 22 నుంచి ‘ఓపెన్‌’ సప్లిమెంటరీ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాట్ల పరిశీలన డిస్పెన్సరీ ఆకస్మిక తనిఖీ కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌ క్రైం/వరంగల్‌ అర్బన్‌: వచ్చే నెల 5న ట్రై సిటీ పరిధిలో నిర్వహించే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి హనుమకొండ ప్రాంతంలో గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం జరిగే కాజీపేట బంధం చెరువు, హనుమకొండ సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువు, కట్టమల్లన్న, చిన్నవడ్డేపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో గురువారం పోలీస్‌ అధికారులతో కలిసి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సీపీ సమీక్షించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన క్రేన్లు, సిబ్బంది నియామకం, విద్యుత్‌ ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం, తెప్పల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఏర్పాట్ల పరిశీలనలో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌, ట్రాఫిక్‌ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, వెంకన్న, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

విద్యారణ్యపురి: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌ 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ అనగోని సదానందం తెలిపారు. ఆయా పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఈఏడాది అక్టోబర్‌ 6 నుంచి 13 వరకు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌, టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు థియరీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జేఎన్‌ఎస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ స్కూల్‌ కమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పనుల్ని గురువారం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ పరిశీలించారు. ఈసందర్భంగా స్టేడియం ఆవరణలోని హాస్టల్‌ భవనం, ఔట్‌ డోర్‌ క్రీడా మైదానాలు, గదుల్ని పరిశీలించారు. డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను మౌలిక వసతులు, తరగతి గదుల ఏర్పాట్ల అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31లోగా క్రీడాకారులకు అవసరమైన వసతులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ వెంట అధికారులు సురేశ్‌, నరేందర్‌రెడ్డి, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది ఉన్నారు.

కాజీపేట: కాజీపేట మున్సిపల్‌ సర్కిల్‌ కార్యాలయం–2లో ఉన్న సివిల్‌ డిస్పెన్సరీని గురువారం డీఎంహెచ్‌ఓ ఎ.అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో రోగుల ఓపీ సేవలు, ఫార్మసీ, ఉద్యోగుల హాజరు తదితర రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి వైద్య సేవలు, రికార్డుల నిర్వహణపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ జయకృష్ణ, పద్మజ, సుశీల, సల్మా, పద్మజ సిబ్బంది పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: భారీ వర్షాల నేపథ్యంలో కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ తెలిపారు. కేయూ పరిధి బీఫార్మసీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు, ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల ఆరో సెమిస్టర్‌ పరీక్షలు, ఎంఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. దూరవిద్య డిగ్రీ ఇయర్‌ వైజ్‌ స్కీం మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు సైతం వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి ఆయా కోర్సుల పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారమే యథావిఽధిగా జరగుతాయని తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో జరగాల్సి ఉండగా.. వాయిదాపడిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ1
1/1

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement