
పాయెతోంగ్తార్న్ షినవత్ర.. మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్ర కూతురు. మరో మాజీ ప్రధాని యింగ్లక్ షినవత్ర మేనకోడలు. కిందటి ఏడాది థాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఫ్యాషన్ డిజైనర్‌గా, మోడల్‌గా అప్పటిదాకా గుర్తింపు దక్కించుకున్న ఆమె.. బ్యూటీఫుల్ ప్రధానిగానూ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

అయితే కంబోడియాతో ఉన్న వైరాన్ని.. థాయ్ ఆర్మీ పవర్‌ను ఆమె తప్పుగా.. తక్కువగా అంచనా వేసింది

కంబోడియా మాజీ ప్రధాని, మాజీ సైనికాధారి హున్ సెన్‌తో షినవత్ర రహస్యంగా ఫోన్ మాట్లాడింది. కొన్నాళ్లకు ఆ ఫోన్ సంభాషణ ఆడియో లీక్ అయ్యింది.

అందులో అంకుల్ అంటూ హున్‌సెన్‌ను పిలవడంతో పాటు థాయ్ సైనికాధికారిని విమర్శిస్తూ మాట్లాడింది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో ఆర్మీ అధికారుల సమక్షంలోనే దేశ ప్రజలకు ఆమె సారీ చెప్పింది. అయినా వివాదం చల్లారలేదు. మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణతో చివరకు ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి ఎదురైంది

ఈ సంభాషణ నేపథ్యంగా థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం తీవ్రతరమై, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 40 మందికి పైగా మృతి చెందగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

వివాదాల నేపథ్యంలో.. థాయ్ రాజ్యాంగ న్యాయస్థానం.. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేసింది. విచారణ ముగియడంతో.. ఇవాళ(2025 ఆగస్టు 29) పదవి నుంచి తొలగిస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తక్షణమే పదవి కోల్పోయారు. తాత్కాలిక ప్రధానిగా ఉన్న ఫుమ్థామ్ వెచయచాయ్ .. పూర్తిస్థాయి ప్రధానిగా కొనసాగుతారా? మరొకరిని ప్రధానిగా ఎన్నుకుంటారా? లేదంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ తీర్పుతో షినవత్ర కుటుంబ రాజకీయ వారసత్వంపై మరోసారి గండిపడింది. తండ్రి, మేనత్తలు గతంలో ఇలాగే గతంలో ఇదే కోర్టు తీర్పు ద్వారా పదవులు పొగొట్టుకున్నారు.





