
పింఛన్ల పెంపు హామీ నెరవేర్చాలి
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
గీసుకొండ/వర్ధన్నపేట: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ పెంచకుంటే సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో తమ గళం విప్పుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. గీసుకొండ మండలం ఎస్‌ఎస్ గార్డె న్స్, వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో దివ్యాంగులతో గురువారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీ రుపై మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని మండిపడ్డారు. రెండో కుమారుడు ఎకై ్సజ్ కానిస్టేబుల్ అయిన యుగేందర్ పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి తన పది గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడని నల్లబెల్లి మండలం రుద్రగూడేనికి చెందిన వృద్ధురాలు లద్దునూరి సూరమ్మ గోడును మంద కృష్ణకు వినిపించింది.