
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆది వారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్‌టెక్‌వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు.
ఇంకా నీటిలోనే రహదారులు
వాజేడు: మండల పరిధిలో మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి.