స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌

Sep 1 2025 4:18 AM | Updated on Sep 1 2025 4:18 AM

స్వచ్

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌

స్టార్‌, పాయింట్స్‌

కేటాయింపు ఇలా..

రేటింగ్‌ పాయింట్స్‌ ఇలా..

విద్యారణ్యపురి: దేశంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్‌ హరిత విద్యాలయ్‌ రేటింగ్స్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌) ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్‌ విద్యాలయ్‌ 2025–26 రేటింగ్స్‌ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని సెప్టెంబర్‌ 30లోగా వివరాలు పంపించాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్‌ హరిత విద్యాలయ్‌ రేటింగ్స్‌ కోసం వివరాలు పంపించాల ని జిల్లాల విద్యాశాఖ అధికారులు సూచించారు. అలాగే, ఆయా అంశాలకు అనుగుణంగా పాఠశాలలను స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని 14 మంది ఎంఈఓలు, స్ట్రాంగ్‌ టీచర్లకు స్వచ్ఛ ఏవమ్‌ శిక్షణపై ఇచ్చారు.

ఎస్‌హెచ్‌వీఆర్‌ లక్ష్యాలు..

పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, బాలల స్నేహపూరిత వాతావరణం పెంపొదించడం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, వినియోగం, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండడం, విద్యార్థులు సమీకృతంగా పాఠశాల, పచ్చదనం, పరిశుభ్రత గురించి సమాజంలో మార్పునకు విద్యార్థులే రాయబారులుగా ఉండడం.

జిల్లా స్థాయిలో ఎంపిక..

జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పొందుపర్చిన సమాచారం మేరకు స్టార్‌ రేటింగ్‌ ప్రకారం కలెక్టర్‌, డీఈఓ, వైద్యాధికారి, ఇంజనీరింగ్‌ అధికారి, స్వచ్ఛంద సంస్థ, ముగ్గురు ఉపాధ్యాయులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఆరు గ్రామీణ పాఠశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు.

రాష్ట్రస్థాయిలో..

రాష్ట్ర విద్యాశాఖ, వైద్యశాఖ, పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల సంచాలకులతో స్వచ్ఛంద సంస్థ, ఇద్దరు ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. 4 స్టార్‌ రేటింగ్‌, అంతకన్నా ఎక్కువ రేటింగ్‌ ఉన్న 14 గ్రామీణ ఉన్నత పాఠశాలలు, 6 పట్టణ పాఠశాలలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారు.

జాతీయ స్థాయిలో 200 పాఠశాలల ఎంపిక..

జాతీయస్థాయిలో 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన 140 గ్రామీణ, 60 పట్టణ ప్రాంతాల పాఠశాలలను ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ హరిత్‌ విద్యాలయ రేటింగ్స్‌లో ఎంపికై న ప్రతీ పాఠశాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తారు.

2014 నుంచి..

దేశంలో 2014లో స్వచ్ఛ భారత్‌–స్వచ్ఛ విద్యాలయగా (ఎస్‌బీఎస్‌వీ), 2016–2017లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌గా (ఎస్‌వీవీ) రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌కు, 2017–2018లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్‌ స్కూళ్లకు కూడా అవకాశం కల్పించారు. 2020–2021లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌–3లో దేశంలో 8.23 లక్షల పాఠశాలలు భాగసాములయ్యాయి. 2025–2026లో నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఎవమ్‌ హరిత్‌ విద్యాలయ (ఎస్‌హెచ్‌వీఆర్‌) మిషన్‌ లైఫ్‌ న్యూ కేటగిరీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఇన్‌ స్కూల్స్‌ డెవలప్‌మెంట్‌ పొందుపర్చారు.

రెండు జిల్లాల్లో పాఠశాలల సంఖ్య..

హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 880 పాఠశాలలు, వరంగల్‌ జిల్లాలోఅన్ని యాజమాన్యాలు కలిపి 1,028 పాఠశాలలు ఉన్నాయి. స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయాలుగా తమ వివరాలను పొందుపర్చి ఎన్ని పాఠశాలలు పోటీపడతాయో వేచి చూడాలి.

పాఠశాలల్లో

పలు అంశాలకు రేటింగ్‌

పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు,

మరుగుదొడ్ల వివరాలు ఎస్‌హెచ్‌వీఆర్‌

యాప్‌లో నమోదు

సెప్టెంబర్‌ 30 గడువు

జాతీయ స్థాయిలో ఎంపికై తే ఒక్కో

పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహకం

పాయింట్స్‌ స్టార్‌

90–100 5

75–89 4

51–74 3

35–50 2

మంచి నీటి వినియోగం 22 పాయింట్స్‌, మరుగుదొడ్ల నిర్వహణ 27, సబ్బులతో చేతులు కడుక్కోవడం 14, ప్రవర్తన, మార్పు 20, పచ్చదనం పరిశుభ్రత 21, పాఠశాలల్లో పర్యావరణ క్లబ్‌ల ఏర్పాటు, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ నివారణ, సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు వంటి అంశాలకు 21 పా యింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్స్‌ ఉంటాయి. పలు విభాగాల్లో అందులోని అంశాలపై వివరాలను పొందుపరిస్తే వచ్చిన పాయింట్స్‌ ఆధారంగా పాఠశాలకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు.

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌1
1/1

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement