
పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. పాకాల మత్తడి వద్ద జలకాలాడుతూ యువత ఉత్సాహంగా గడిపారు. బోటింగ్ చేస్తూ పాకాల సందడిని ఆస్వాదించారు.
‘దూసపాటిలొద్ది’కి
అనుమతి లేదు
వాజేడు: దూసపాటిలొద్ది జలపాతానికి పర్యాటకులకు అనుమతి లేదని ఎఫ్‌బీఓ లలిత తెలిపారు. మండల పరిధిలోని కొంగాల గ్రామ సమీపంలోని గుట్టల వద్ద ఉన్న దూసపాటి లొద్ది జలపాత సందర్శనకు ఆదివారం పలువురు పర్యాటకులు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఎఫ్‌బీఓ లలిత పర్యాటకులకు లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని తిరిగి పంపించారు.