శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
రాజ్యాంగ హక్కులను హరించడమే..
నైపుణ్యం సాధించండి
● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి
● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్
బ్యారెక్స్‌లో పోలీస్ శిక్షణ ప్రారంభం
కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమ స్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు.
విజయనగరం క్రైమ్/డెంకాడ:
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్, విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్‌లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, రెండు చోట్లకు శిక్షణకు వచ్చిన 395 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు.
ఏపీఎస్పీ, సీవిల్ విభాగాలు వేర్వేరుకాదని, అందరమూ ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన వారమేనన్న విషయాన్ని మరువరాదని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. శిక్షణలో అవుట్ డో ర్, ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా, ఆయుధాల వినియో గం, స్విమ్మింగ్, మ్యాప్ రీడింగ్‌లో పట్టుసాధించాలన్నారు. సైబర్ నేరగాళ్లను అరికట్టే సైబర్ వారియర్స్‌గా మారాలన్నారు. శిక్షణకు వచ్చినవారిలో 12 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 28 మంది బీటెక్, ముగ్గురు ఎల్‌ఎల్‌బీ, ఇద్దరు జర్నలిజం, మిగిలిన వారు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివినవారు ఉన్నారని డీపీటీసీ ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తెలిపారు. శిక్షణ వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 కి పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్‌వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్‌బోస్, డీపీటీసీ డీఎస్పీ పి.నారాయణరావు, డీఎస్పీలు ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం


