వైఎస్సార్‌ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి

Jan 30 2024 1:44 AM | Updated on Feb 3 2024 5:50 PM

తెర్లాం: ఆసరా సంబరాల్లో పాల్గొన్న పొదుపు సంఘాల మహిళలు   - Sakshi

తెర్లాం: ఆసరా సంబరాల్లో పాల్గొన్న పొదుపు సంఘాల మహిళలు

చీపురుపల్లి, తెర్లాంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి. మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కలిగిన ఆర్థిక ప్రయోజనాలను తెలియజేశారు. థాంక్యూ సీఎం సార్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలకు అండగా నిలుస్తూ, ఆర్థిక సంక్షేమానికి కృషిచేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామంటూ చేతులెత్తి చెప్పారు.

జగనన్న పాలనకు జేజేలు పలికారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన, మహిళలకు చేసిన మేలును మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వివరించారు. పొదుపు మహిళలకు చీపురుపల్లిలో రూ.11.5కోట్లు, తెర్లాంలో రూ.5.89కోట్ల చెక్కులను అందజేశారు. ఎన్నికల వేళ మాయమాటలతో మోసంచేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. అతివలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న ఘనత  జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వందేనని స్పష్టంచేశారు. – చీపురుపల్లి/తెర్లాం

Advertisement
 
Advertisement
Advertisement