అరాచక పాలనపై.. మహిళల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అరాచక పాలనపై.. మహిళల ఆగ్రహం

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

విజయనగరం:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి మహిళలకు భద్రత కరువైందని, నిత్యం జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వై.ఎస్‌.జగనన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఆదే లాస్ట్‌ డే చేసిన ప్రకటనలు డ్రామాలకే పరిమితామయ్యారా... అంటూ నిలదీశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అధికారంలో ఉన్న పాలకులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. అరాచక పాలనకు నిరసనగా విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల ప్రాంగణం నుంచి బాలాజీ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడి బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు సర్కారుకు రాజ్యాంగ విలువలు పాటించేలా సద్బుద్ధిని ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదును ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు... మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు డౌన్‌ డౌన్‌... మహిళలకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజేశ్వరి, వల్లిరెడ్డి శిరీష, శాంతకుమారి, చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, గరివిడి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, రాష్ట్ర అంగన్‌వాడీ కార్యదర్శి బెవర ఉమాకుమారి, అంగ

ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్‌ కాలంనాటి పాలన

ఊరికో సైకోను తయారు చేస్త్తున్న పచ్చచొక్కా దండు

ఆడబిడ్డల జోలికొస్తే ఆదే లాస్ట్‌ డే

అంటూ చేసిన ప్రకటనలు డ్రామాలకే

పరిమితామా..?

రెండేళ్ల ప్రభుత్వ పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పట్టవా..?

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

ఆధ్వర్యంలో కదం తొక్కిన మహిళలు

జిల్లా కేంద్రంలోని బాలజీ కూడలిలో

నిరసన

రాజ్యాంగ విలువలు కాపాడేలా

మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement