● పిడుగు పాటుకు రైతు మృతి
● పొలంలో కూలీలతో కలిసి కలుపుతీస్తుండగా ఘటన ● ఇంటి పెద్ద మృతితో శోకసంద్రంలో
కుటుంబం
మృతుడు
కృష్ణమూర్తి
సంతకవిటి: మండలంలోని మంతిన పంచా యతీ మల్లయ్యపేట గ్రామంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవడంతో పాటు పిడుగు పడడంతో మూల కృష్ణమూర్తి(65) అనే రైతు మరణించాడు. ఆయన ఉదయం 10 గంటల సమయంలో తన పొలంలో ఐదుగురు మహిళలతో కలిసి వరి వెదలో కలుపు తీసే పనికి వెళ్లాడు. అందరూ పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం భోజనం చేశాక మళ్లీ పనిలో చేరారు. సాయంత్రం మేఘాలు ఆవరించడంతో వర్షం కురిస్తే వరి పైరుకు మేలు జరుగుతుందనుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు కృష్ణమూర్తిని తాకింది. అంతే... పక్కనే పనిచేస్తున్న మహిళలు భీతిల్లిపోయారు. ఒడ్డుకు పరుగుతీశారు. కొంతసమయం తర్వాత తేరు కుని రైతు వద్దకు వెళ్లారు. అప్పటికే ఆయన మృతిచెందడంతో కన్నీరుపెట్టారు. మృతుడికి ఇద్దరు కుమారుల్లో ఒకరు ఎస్సైగా, మరొకరు ఎలక్ట్రికల్ ఏఈగా ఉద్యోగం చేస్తున్నారు.


