గోల్డ్‌ షాట్‌బాల్‌లో వెల్లంకి విద్యార్థినుల సత్తా | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ షాట్‌బాల్‌లో వెల్లంకి విద్యార్థినుల సత్తా

Aug 18 2026 7:28 AM | Updated on Aug 18 2026 7:28 AM

ఆనందపురం: తెలంగాణలోని ఆదిలాబాద్‌ వేదికగా ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి గోల్డ్‌ షాట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన జెడ్పీహెచ్‌ఎస్‌ వెల్లంకి పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బీహార్‌ రాష్ట్ర జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో హోరాహోరీగా పోరాడి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో పదో తరగతి విద్యార్థినులు ప్రియాంక కుమారి, పడాల ధనలక్ష్మి, వానపల్లి హర్షిత, తాతపూడి పూజిత, గొలగాని శిరీష, తాతపూడి కుసుమలు ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థినుల ప్రతిభను గుర్తించిన గోల్డ్‌ షాట్‌బాల్‌ ఇండియా కార్యదర్శి నోటా రాజేంద్రప్రసాద్‌ పాఠశాలను సందర్శించి విజేతలకు మెడల్స్‌, జాతీయ స్థాయి సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాడిశెట్టి రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడాకారిణులకు అత్యుత్తమ శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు తోణంగి సరితను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement