విశాఖ లీగల్: వచ్చే నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణ నుంచి వర్చువల్‌గా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో లోక్ అదాలత్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు లోక్ అదాలత్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, అన్ని న్యాయస్థానాల జ్యుడిషియల్ అధికారులు పాల్గొన్నారు.
వీబీసీఏ అధ్యక్షుడిగా రోలండ్ విలియమ్స్