
ఉక్కు పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణ
పార్టీ నేతల సలహాలు, సూచనలతో సమన్వయ కమిటీ ఏర్పాటు
బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి
వైఎస్సార్ సీపీ కేడర్‌కు శాసనమండలి విపక్షనేత బొత్స పిలుపు
కేకే రాజు అధ్వర్యంలో
జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవంగా భావించే విశాఖ ఉక్కును కాపాడటానికి ఎలాంటి పోరాటాలకై నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముందుకొచ్చే ఇతర పార్టీలను, కార్మిక నాయకులను కలుపుకుని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మద్దిలపాలెం లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్వర్యంలో ఆదివారం పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ విశాఖలో మూడు రోజుల పాటు ఉన్న పవన్‌కల్యాణ్.. స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడకుండా వెళ్లిపోయారని, ఈ ప్రాంత ప్రజల, కార్మికుల కుటుంబాల ఆవేదన ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు.
సమావేశంలో కీలక నిర్ణయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పోరాటానికి మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు, కార్మిక సంఘాలతో త్వరలో రౌండ్ టేబుల్ మిగతా 8లో