
ఆ చిన్నారికి చేయూత కావాలి
క్యాన్సర్‌తో బాధపడుతున్న అయాన్‌తేజ్
రూ. 20లక్షలు ఖర్చవుతుందని
చెబుతున్న వైద్యులు
ఇప్పటికే ఇల్లు, కారు అమ్మి
వైద్యం చేయిస్తున్న తల్లిదండ్రులు
దాతల సాయం కోసం ఎదురు చూపు
గోపాలపట్నం: చిరునవ్వుల ఆనందంతో గడపాల్సిన ఒక ఏడాది చిన్నారి, పుట్టినప్పటి నుంచే జీవితంతో పోరాడుతున్నాడు. ఎన్. అయాన్ తేజ్ అనే ఈ పసివాడు ‘విస్కోట్ ఆల్డ్రిచ్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతనిలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా క్షీణించింది. ఫలితంగా నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ, చూపును కూడా కోల్పోయాడు. అయాన్ తేజ్ తల్లిదండ్రులు నిటిపల్లి వాసు, పావని తమ కొడుకు కోసం గత ఏడాది కాలంగా అష్టకష్టాలు పడుతున్నారు. అతడి చికిత్స కోసం ఇప్పటికే తమ ఇల్లు, కారు కూడా అమ్ముకుని దాదాపు రూ.16 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ కొడుకును బతికించుకోవడానికి వారికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది..హల్పో ఐడెంటికల్ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ చికిత్సకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇందులో రూమ్ ఛార్జీలు, మందులు, బ్లడ్ ప్రొడక్షన్, స్టీమ్ సెల్ ప్రాసెసింగ్ వంటి పలు ఖర్చుల కోసం లక్షల రూపాయలు అవసరమవుతాయి.
కుటుంబ సభ్యుల నుంచి ..
అయాన్ తేజ్ కు హాప్లో ఐడెంటికల్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి. ఇందుకు అతని కుటుంబ సభ్యుల నుంచి బోన్ మారో సేకరించి అది బాబుకు సరిపోతుందో లేదో పరీక్షించాలి. ఇంట్లో ఉన్న ముగ్గురికి ఈ పరీక్షలు చేయించడానికి అదనంగా రూ.వేలల్లో ఖర్చవుతుంది. అదృష్టవశాత్తు, అయాన్ తేజ్ అన్న బోన్ మారో సరిపోయినట్లయితే, చికిత్స ప్రారంభించవచ్చు. ఇప్పటికే తమకున్నదంతా ఖర్చు చేసిన ఆ కుటుంబానికి ఈ మొత్తం భరించడం అసాధ్యం. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రుల హృదయవేదన చూసి పలువురు కన్నీటిపర్యంతమవుతున్నారు.
దాతల సాయం కోసం..
అయాన్ తేజ్ చికిత్స కోసం దాతల నుంచి సాయాన్ని తల్లి దండ్రులు కోరుతున్నారు. వీరి ఫోన్‌పై నంబర్ 9014097133, అకౌంట్ నంబర్ 37760806272, ఐఎస్‌ఎఫ్ కోడ్: ఎస్‌బీఐఎన్0004816 ఎకౌంట్ హోల్డర్ పేరు నిటిపల్లి వాసు.

ఆ చిన్నారికి చేయూత కావాలి