
‘మిస్ విశాఖ’గా డాక్టర్ సృజన
ఏయూక్యాంపస్: నగరంలోని యువతులు, తమ స్టైల్, గ్లామర్‌తో ర్యాంప్‌పై సందడి చేశారు. సరికొత్త డిజైనర్ వేర్ ధరించి, ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. ఆత్మవిశ్వాసంతో కూడిన వారి అడుగులు, ఆకట్టుకునే భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రతి యువతి తనదైన స్టైల్‌తో ర్యాంప్‌పై తళుక్కున మెరిసింది. ఆదివారం ఓ హోటల్‌లో ‘ఫరెవర్ మిస్ ఇండియా విశాఖపట్నం 2025’ పోటీలు నిర్వహించారు. ‘మిస్ విశాఖ’ గా డాక్టర్ సృజనదేవి నిలిచారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ బీకే అగర్వాల్ , కరణం రెడ్డి నరసింగరావు ఆమెకు అందాల పోటీ కిరీటాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ యార్లగడ్డ గీత, నాగమణి, డాక్టర్ మీనాక్షి అనంత రామ్ తదితరులు పాల్గొన్నారు.