
నేడు వైఎస్సార్ సీపీజిల్లా సర్వ సభ్య సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా సర్వ సభ్య సమావేశం ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూ రావు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబుతో పాటు సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయ ర్, ముఖ్యనాయకులు హాజరవుతారు. సమావేశానికి జిల్లా ముఖ్యనాయకులు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, వార్డు అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు.