రేపు విశాఖకు సీఎం జగన్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు విశాఖకు సీఎం జగన్‌

Nov 1 2023 12:54 AM | Updated on Nov 1 2023 10:16 AM

- - Sakshi

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖ వస్తున్నారు. ఉదయం 7.35 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 8.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో 9.15 గంటలకు మధురవాడ ఐటీ హిల్‌కు చేరుకుంటారు. 9.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌కు బయలుదేరుతారు.

9.30 గంటల నుంచి 11 గంటల వరకు 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ ప్లీనరీలో (ఐసీఐడీ) పాల్గొంటారు. 11.05 గంటలకు రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌ నుంచి బయలు దేరి మధురవాడ హెలిపాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. 11.45 గంటలకు విమానంలో తిరుగు పయనమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement