తాండూరు రూరల్: పెద్దేముల్ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి, ప్రమాదకరంగా తయారైంది. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాండూరు నుంచి సంగారెడ్డికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ మార్గంలో తాండూరు నుంచి అంతారం, కందనెల్లితండా, గాజీపూర్, బుద్దారం, పెద్దేముల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తుంటారు. ఈరూట్‌లో బుద్దారం బ్రిడ్జి నుంచి పెద్దేముల్ కొత్త బస్టాండ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
గాజీపూర్ బ్రిడ్జి బురదమయం
గాజీపూర్ వాగు వద్ద కొద్ది సంవతర్సాల క్రితం కొత్త బిడ్జ్రి నిర్మించారు. దీనికి ఇరువైపులా బీటీస వేయకుండా మట్టి నింపి వదిలేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమవుతోంది. మనోహార్‌రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి వద్ద బీటీ వేయించడంలేదని గాజీపూర్‌వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నిధులు మంజూరు చేయాలి
మద్వాపూర్ నుంచి కోట్‌పల్లికి వెళ్లే మట్టి రోడ్డును బీటీగా మార్చాలి. ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. వర్షాకాలం ముగిసే వరకూ కనీసం కంకర రోడ్డయినా వేస్తే వాహనదారులకు కొంత సౌకర్యం కలుగుతుంది.
– ప్రభు, మద్వాపూర్
అధ్వానంగా పెద్దేముల్,
మాద్వాపూర్– కోట్‌పల్లి రహదారులు
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
త్వరలో మరమ్మతులు
గుంతలమయమైన పెద్దేముల్ రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్)కింద ప్రభుత్వం తాండూరు నుంచి కోట్‌పల్లి వరకు 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.74 కోట్ల 71 లక్షలు మంజూరు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు ప్రారంభిస్తాం.
– శ్రవణ్, డీఈ, ఆర్‌అండ్‌బీ శాఖ


