పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Jul 31 2026 7:22 AM | Updated on Jul 31 2026 7:22 AM

దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 6

8నుంచి తరగతుల ప్రారంభం

మున్సిపల్‌ చైర్మన్‌

నందారం ప్రశాంత్‌కుమార్‌

కొడంగల్‌ రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. గురువారం కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు కృషిచేయాలని తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరంలో చేరేందుకు ఆగష్టు 06వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగష్టు 8వ తేదీలోపు ఆధార్‌కార్డు జిరాక్స్‌, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లు కడా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇదే రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ అందజేస్తామని, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈవెంట్స్‌ తదితర అంశాలపై పూర్తి స్థాయి ట్రైనింగ్‌ ఉంటుందన్నారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌ తదితర ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement