నేరాల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు చర్యలు

Jul 31 2026 7:22 AM | Updated on Jul 31 2026 7:22 AM

కుల్కచర్ల: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన కుల్కచర్ల స్టేషన్‌ను సందర్శించారు. దొంగతనాలు, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరగకుండా ప్రత్యేక కార్చాచరణతో ముందుకుసాగాలన్నారు. సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం చౌడాపూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. కారక్రమంలో పరిగి సీఐ కొండల్‌ రెడ్డి, కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. చౌడాపూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు కావస్తున్నా చౌడాపూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయలేదని వెంటనే చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీ వెంకటేష్‌ కోరారు. చౌడాపూర్‌కు వచ్చిన పరిగి డీఎస్పీకి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement