బంట్వారం: మండల పరిధిలోని మాద్వాపూర్– కోట్‌పల్లి లింక్ రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. మాద్వాపూర్ నుంచి కోట్‌పల్లి వెళ్లేవారు సల్బత్తాపూర్ మీదుగా వెళ్తే ఎక్కువ దూరం అవుతుందని ఈమార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. ప్రతీ సోమవారం కోట్‌పల్లిలో నిర్వహించే సంతకు వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటారు. రోడ్డు బురదమయం కావడంతో కాలినకడన కోట్‌పల్లి వెళ్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈమార్గంలో బీటీ వేయాలని కోరుతున్నారు.


