సింధూరం వెంకటేశ్‌కు ఉత్తమ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సింధూరం వెంకటేశ్‌కు ఉత్తమ పురస్కారం

Jul 31 2026 7:22 AM | Updated on Jul 31 2026 7:22 AM

దౌల్తాబాద్‌: మండలంలోని సురాయిపల్లి గ్రామానికి చెందిన రచయిత సింధూరం వెంకటేష్‌ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో అవార్డు తీసుకున్నారు.

పోగొట్టుకున్న

సెల్‌ఫోన్ల అప్పగింత

ధారూరు: చోరీకి గురైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని గురువారం బాధితులకు అప్పగించామని ధారూరు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు. పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్‌, ధారూరు మండలం దోర్నాల్‌తండాకు చెందిన రవీందర్‌, నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రీశైలంకు సెల్‌ఫోన్లు అందజేశామని స్పష్టంచేశారు. ఎవరైనా మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయొద్దని తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో

పాడి గేదె మృతి

బొంరాస్‌పేట: విద్యుత్‌ షాక్‌తో ఓ గేదె మృతిచెందిన ఘటన రేగడిమైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న నర్సిరెడ్డికి చెందిన రూ.70 వేల విలువచేసే పాడి గేదె గురువారం మేతకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఊరి శివారులోని మహాదేవుని ఆలయం వెనక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

ఈశ్వరప్ప సేవలు

అభినందనీయం

బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు

కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని పార్టీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఈశ్వరప్ప లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. మన చరిత్రకు మూలం ఆలయాలే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజిలయ్య, ఉప సర్పంచ్‌ విజయకుమార్‌, మాజీ సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, నాయకులు మైపాల్‌, చందు, భీమయ్య, కర్ణయ్య, సురేందర్‌, ప్రవీణ్‌, చంద్రకాంత్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కళాశాల భవనాన్ని

పూర్తి చేయాలి

ఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌ షఫీమియా

దౌల్తాబాద్‌: మండల కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని ఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌ షఫీమియా ఆదేశించారు. గురువారం భవన నిర్మాణ పనులను పరిశీలించా రు. పనులు ఎంత మేరకు జరిగాయి.. ఇంకా పెండింగ్‌ ఉన్నవి ఏమిటని ఆరా తీశారు. సీఎం సూచనల మేరకు దౌల్తాబాద్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఈ శ్రీనివాసులు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement