మాపై ఎందుకీ వివక్ష? | - | Sakshi
Sakshi News home page

మాపై ఎందుకీ వివక్ష?

Jul 31 2026 7:22 AM | Updated on Jul 31 2026 7:22 AM

బషీరాబాద్‌: కొంతమంది అధికారులు తమపట్ల వివక్ష చూపుతున్నారని బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతకుముందు కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది తమ గ్రామాలకు సంబంధించిన ఏఒక్క పనిని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని ఆరోపించారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు మొదలుకుని ఎంపీడీఓ వరకు బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ పనులకు సంబంధించిన చెక్కులను నెలల తరబడి ఆన్‌లైన్‌ చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా జీపీల చెక్కులు క్లియర్‌ చేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందంచడం లేదని, ఆఫీసుకు వెళ్లి అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సర్పంచులు పాండురంగారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, బసప్ప, జైపాల్‌రెడ్డి, కృష్ణకుమార్‌తో పాటు నాయకులు రంగారెడ్డి, వడ్డీ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండల పరిషత్‌లో

ఒక్క పని కూడా కావడం లేదు

చెక్కుల క్లియరెన్స్‌లో

నెలల తరబడి జాప్యం చేస్తున్నారు

బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, నాయకుల ఆవేదన

ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement