● వాగులు, చెరువులకు జలకళ
● హర్షం వ్యక్తంచేస్తున్న అన్నదాతలు
ధారూరు: మండలంలో బుధవారం 10.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా గురువారం 4.02 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ప్రమాదకరమైన వాగులు, కాల్వలను దాటొద్దని సూచించారు. భారీ వానలు కరుస్తున్న నేపద్యంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతన్నలకు భారీ వాన ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన కోట్‌పల్లి ప్రాజెక్టుతో పాటు అల్లీపూర్, ఎబ్బనూర్, మున్నూరుసోమారం, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్‌తండా, అంపల్లి, గురుదోట్ల, నాగారం, రాజాపూర్, కేరెళ్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి.


