కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ
బంట్వారం: వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ తెలిపారు. గురువారం ఆమె ఠాణాలో విలేకరులతో మాట్లాడారు. ఉధృతంగా పారే వాగులు, వంకలు దాడకూడదన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్నపిల్లలు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించే వారిని గుర్తించి ఖాళీ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
ఎమ్మెల్యేపై వ్యక్తిగత
విమర్శలు సరికాదు
జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్
మొయినాబాద్: పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తీరు ‘ఒడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అనే చందంగా ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ అన్నారు. గురువారం మొయినాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీంభరత్, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయడంతోనే దర్శన్ సతీమణి సోనియాకు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి దక్కిందన్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే యాదయ్యపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించి, పరిష్కరించుకోవాలని అంతేకానీ బహిరంగ వేదికలపై విమర్శలు చేయడగం తగదని హితవుపలికారు.


