డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
కేశంపేట: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషించాలని డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్‌లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మళ్లీ నిర్వహించే మండల స్థాయి సమావేశం లోపు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలసిరి పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్‌లు నిర్మించుకోవాలలని చెప్పారు. అనంతరం కేశంపేట, అల్వాల గ్రామాల్లో విబిజీ రామ్‌జీ పథకంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ దయానంద్, విద్యుత్ ఏఈ ఈశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్‌రావు, ఎంపీఓ అజీజ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.


