దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో పురోగతిపై కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నర్సింగ్, మెడికల్ కళాశాలలు, బాలికల, బాలుర హాస్టళ్లు, డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎక్కువ మంది లేబర్లతో రెండు షిప్టులుగా పనులు చేపట్టాలని కాంట్రాక్లర్లకు, ఎడ్యుకేషన్ హబ్ ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఆగస్టు 5వ తేదీ వరకు పనుల్లో పనుల్లో పురోగతి కనిపించాలన్నారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీ, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఫీక్, ఇంజనీర్ కృష్ణ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


