జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్
దుద్యాల్/బొంరాస్‌పేట్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎంఏ సత్తార్ అన్నారు. మంగళవారం ఆయన దుద్యాల్, బొంరాస్‌పేట్ మండలాల్లో పర్యటించారు. దుద్యాల్ మండలం పల్లెగడ్డకు చెందిన వెంకట్‌రెడ్డి, బొంరాస్‌పేట్ మండలానికి చెందిన వెంకటరాములు గౌడ్ ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహింస్తోందని.. ఆసక్తి ఉన్నవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. దుద్యాల్ మండలంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండడం ఇక్కడి రైతుల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఉద్యన అధికారి సురేంద్రనాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


