ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్
తాండూరు రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు అన్యాయం చేస్తే ఊరుకోమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. బుధవారం మండల పరిధి బెల్కటూర్‌లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నాలుగో జిల్లా మహాసభలు నిర్వహించారు. ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. లెబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు విజయలక్ష్మి పండిత్, బాల శంకర్, దశరథ్ గౌడ్, జైపాల్‌రెడ్డి, రవీంధర్, వంశీకృష్ణ, తహర్ పాషా, జంగయ్య, అజయ్, రాజేశ్వర్‌రెడ్డి, పాండు, అశోక్, నర్సిములు, నాయకులు శరణు బసప్పలు పాల్గొన్నారు.


