మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
బంట్వారం: బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని రొంపల్లిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకీ బలం బలగమన్నారు. కాంగ్రెస్ మునిగే నావలాంటిదన్నారు. భవిష్యత్ అంతా బీఆర్‌ఎస్‌దేనన్నారు. నాయకులు మనస్పర్థలు వీడి కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు సర్ ప్రక్రియను పరిశీలించి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. బీఆర్‌ఎస్ ఓట్లు గల్లంతు కాకుండా జాగత్త పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు బల్వంత్‌రెడ్డి, ఫిరోజ్, చందూ సింగ్, వీరప్ప, సాయిలు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


