ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

మీర్‌పేట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఆయన ప్రశాంతి హిల్స్‌ ద్వారకామయి సాయిబాబ పీఠంలో పీఠాధిపతి గోపాలకృష్ణానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్‌తో కలిసి రహస్య తత్వార్థ బోధనలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ జానకి కొడపి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యులు సామిడి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement