ధారూరు: గ్రామసభ.. తీర్మానాలకు వేదికగా మారింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పలు అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయించారు. బుధవారం ధారూరులో సర్పంచ్ ప్రమీళగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో.. కార్యదర్శి అంజానాయక్ జలసిరిపై వివరించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంట, బోరుబావు రీచార్జి నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానించారు. మండల కేంద్రంలో మొత్తం 3,930 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశామని, వాటిలో ఇప్పటి వరకు వరకు 2,841 ఫారాలను తిరిగి తీసుకొని, ఆన్‌లైన్‌లో నమోదు చేశామని సర్పంచ్ తెలిపారు. గుంతల్లో మట్టి వేయించి పూడ్చాలని ప్రజలు కోరారు. వీరభద్రేశ్వరస్వామి దేవాలయం నుంచి శాలివాహన కాలనీ వరకు మురికి కాల్వ నిర్మించాలని, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. సమావేశంలో ఎల్‌ఎన్‌తండా సర్పంచ్ పూజ, ఉప సర్పంచ్ జహంగీర్, కోఆప్షన్ మాజీ సభ్యుడు హఫీజ్, డీసీసీ కార్యదర్శి బాబాఖాన్, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.
సమష్టి చర్చ..సమస్యల పరిష్కారానికి నిర్ణయం


