నైపుణ్య శక్తిని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శక్తిని పెంపొందించుకోవాలి

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

షాద్‌నగర్‌రూరల్‌: విద్యార్థులు నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీత అన్నారు. బుధవారం షాద్‌నగర్‌లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంక్వి ల్యాబ్‌ ఫౌండేషన్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐడియేషన్‌, డిజైన్‌ థింకింగ్‌ ఇన్నోవేషన్‌ స్కిల్స్‌, స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్‌ నీత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాస్తవ జీవిత, సామాజిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వేర్వేరు బృందాలుగా విడిపోయి వినూత్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సిబ్బంది ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

గిరిజన మహిళా డిగ్రీ కళాశాలప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement