మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

షాబాద్‌: మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుర్వగూడ, లక్ష్మారావుగూడ గ్రామాల్లోని పలు దుఖాణాల్లో డాగ్‌స్వాడ్‌ బృందంతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి మత్తుపదార్థాలు, గంజాయి సరఫరా అవుతుందనే అనుమానంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడూ నిఘా పెట్టాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో కంపెనీలు రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కూలీలు ఇక్కడికి వస్తున్నారని.. వారంతా ఏం చేస్తున్నారో ప్రజలు నిఘా పెట్టి ఉంచాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 100కు డయల్‌ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చెన్నారెడ్డి, సర్పంచ్‌లు సంధ్యమల్లికార్జున్‌గౌడ్‌, కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇన్‌స్పెక్టర్‌ డీకే లక్ష్మిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement