డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

రాజేంద్రనగర్‌ ఎస్‌ఈ శ్రీరామ్‌ మోహన్‌

మహేశ్వరం: పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్‌ విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ) శ్రీరామ్‌ మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తుమ్మలూరులో 33–11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో రూ.కోటి నిధులతో అదనపు 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్‌ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరాను అందిస్తామన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్‌ను సమతుల్యం చేయడం, ఓవర్‌ లోడింగ్‌ను నివారించడం, వినియోగదారులకు నాణ్యతతో కూడిన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు దోహదపడుతుందన్నారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా సబ్‌స్టేషన్ల సామర్థాన్ని పెంచడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కందుకూరు విద్యుత్‌ డీఈ గోపాలకృష్ణ, ఎంఆర్‌టీ ఏడీఈలు శంకర్‌, స్వాతి, శ్రీనివాస్‌, రామలింగారెడ్డి, మహేశ్వరం ఏఈ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement