సర్‌.. వందశాతం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సర్‌.. వందశాతం లక్ష్యం

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

కలిసికట్టుగా ముందుకు సాగండి

ఆర్డీఓ వాసుచంద్ర

పరిగి: సర్‌ ప్రక్రియలో పురోగతి తక్కువ ఉన్న పోలింగ్‌ స్టేషన్‌లపై దృష్టి సారించాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడారు. ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఆగస్టు 3 లోపు పూర్తికావాలని చెప్పారు. వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందుకు సమష్టిగా అందరూ ముందుకు సాగాలన్నారు. ఎన్యుమరేషన్‌ పత్రాలనుబీఎల్‌ఓలకు తిరిగి ఇవ్వని పక్షంలో హక్కు కోల్పోతారని ఓటర్లకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే విషయమై నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్‌బాబు, విజయోందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement