ధారూరు: తొలుత ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసిన బీఎల్‌ఓలు, అధికారులు.. సోమవారం మండల కేంద్రంలో సర్పంచ్‌తో కలసి ఇంటింటికి వెళ్లి పత్రాలు సేకరించారు. ఆగస్టు 3వ తేదీతో ఎస్‌ఐఆర్ గడువు ముగియనుండటంతో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వార్డుల్లో పర్యటించారు. నింపని ఫారాలను పూరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలగౌడ్, ఎంపీడీఓ నర్సింహులు, ఆర్‌ఐ స్వప్న, కార్యదర్శి ఆంజానాయక్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
ఫీజు కట్టకుంటే పరీక్షలు రాయనీయం
గోల్కొండ: మొత్తం వార్షిక ఫీజు కడితేనే ఫార్మేటివ్ పరీక్షలు రాయనిస్తామని మెహిదీపట్నంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తేల్చిచెప్పింది. ఫార్మేటివ్ టెస్టు లు సోమవారం నుంచి ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం స్కూల్‌కు రాగానే ‘మీ రు ఫీజు కట్టలేదు, పరీక్షలు రాయనివ్వం’ అంటూ సిబ్బంది పలువురిని బయటే నిలబెట్టా రు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఫీజు విషయంపై ఒత్తిడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
బోనాలకు మంత్రి
శ్రీధర్‌బాబుకు ఆహ్వానం
రాంగోపాల్‌పేట్: ఆగస్టు 2,3 తేదీల్లో జరుగనున్న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబుకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దేవాలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ శివకుమార్‌లాల్, గుండెల్లి వరప్రసాద్, మల్లికార్జున్, గీత, సోనల్, ముప్పిడి కిరణ్, రాజేందర్, ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ మంత్రిని ఆహ్వానించారు.


